తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఆ ఆటగాళ్ల కుటుంబాలకు రూ.5 లక్షలు సాయం'

కరోనా కారణంగా మరణించిన ఇద్దరు దిగ్గజ హాకీ ఆటగాళ్ల కుటుంబాలకు రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిపారు కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజుజు. ఎంకే కౌౌశిక్, రవీందర్ పాల్ సింగ్​ మరణించడం బాధాకరమని ట్వీట్ చేశారు.

sports minister
కిరణ్ రిజుజు, క్రీడా శాఖ మంత్రి

By

Published : May 13, 2021, 12:55 PM IST

కొవిడ్ కారణంగా మృతిచెందిన హాకీ మాజీ క్రీడాకారుల కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షలు ఆర్ధిక సాయం చేస్తామని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజుజు వెల్లడించారు. ఇటీవలే దిగ్గజ హాకీ ఆటగాళ్లు.. ఎంకే కౌశిక్, రవీందర్ పాల్ సింగ్ కరోనాతో మృతిచెందారు.

"కొవిడ్​ కారణంగా ఇద్దరు హాకీ మాజీ ఆటగాళ్లను భారత్​ కోల్పోయింది. ఎంకే కౌశిక్, రవీందర్​ పాల్ సింగ్​ను భారత్​ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది. ఈ కష్టసమయంలో వారి కుటుంబసభ్యులకు అండగా నిలిచేందుకు రూ. 5 లక్షలు ఒక్కో కుటుంబానికి అందిస్తున్నాం."

--కిరణ్ రిజుజు, కేంద్ర క్రీడా శాఖ మంత్రి.

1980 ఒలింపిక్స్​లో విజయం సాధించిన భారత హాకీ జట్టుకు ఇరువురు దిగ్గజ ఆటగాళ్లు భాగస్వామ్యం వహించారు.

ఇదీ చదవండి:'ఎవరేమన్నా.. టోక్యో ఒలింపిక్స్​ ఆగదు'

ABOUT THE AUTHOR

...view details