తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఒలింపిక్స్​ టెస్ట్ ఈవెంట్​లో భారత్​ డబుల్​ ధమాకా - భారత మహిళల హాకీ జట్టు

ఒలింపిక్స్‌ టెస్టు ఈవెంట్​లో భారత మహిళల హాకీ జట్టు అదరగొట్టింది. ఫైనల్లో జపాన్​పై 2-1 తేడాతో విజయం సాధించింది. బుధవారం జరిగిన మ్యాచ్​లో తొలి అర్ధ భాగం డ్రాగా ముగియగా... పెనాల్టీ కార్నర్​ ద్వారా గెలిచింది భారత జట్టు.

ఒలింపిక్స్​ టెస్టు ఈవెంట్​లో మహిళలు సత్తా

By

Published : Aug 21, 2019, 7:32 PM IST

Updated : Sep 27, 2019, 7:35 PM IST

ఒలింపిక్స్​ టెస్టు ఈవెంట్​లో అద్భుతమైన ప్రదర్శన చేసింది భారత మహిళల హాకీ జట్టు. బుధవారం జరిగిన ఫైనల్లో ఆతిథ్య జపాన్​ను 2-1 తేడాతో ఓడించింది ఉమెన్​ టీమిండియా. టోక్యోలోని నార్త్​ పిచ్​ వేదికగా జరిగిన మ్యాచ్​లో హోరాహోరీగా తలపడ్డాయి ఇరుజట్లు. చివరకు విజయం భారత్​నే వరించింది.

తొలి అర్ధభాగంలోని 11వ నిమిషం వద్ద మొదటి గోల్​ చేసింది భారత క్రీడాకారిణి నవజోత్​ కౌర్​. తర్వాతి నిమిషంలో జపాన్​ ప్లేయర్​ షిముజు గోల్​ చేయడం వల్ల రెండు జట్ల స్కోర్లు సమమయ్యాయి. అయితే రెండో అర్ధభాగంలో మిజోరాం అమ్మాయి లారెమ్​సైమీ... పెనాల్టీ కార్నర్​తో పాయింటు తెచ్చింది. ఫలితంగా టెస్టు ఈవెంట్​లో విజేతగా నిలిచింది మహిళా హాకీ టీమిండియా.

గతంలో జరిగిన ఎఫ్​ఐహెచ్​ సిరీస్​ ఫైనల్స్​లోనూ ఇదే జట్టుపై విజయం సాధించింది రాణీ రాంపాల్​ సారథ్యంలోని జట్టు. ఇదే ఆత్మవిశ్వాసంతో త్వరలో ఒలింపిక్స్​ క్వాలిఫయర్స్​ పోటీలకు వెళ్లనుంది మహిళల హాకీ బృందం.

ఈ రోజు జరిగిన పురుషుల టెస్టు ఈవెంట్​లోనూ 5-0 తేడాతో న్యూజిలాండ్​పై గెలిచింది భారత మెన్స్​ హాకీ జట్టు.

Last Updated : Sep 27, 2019, 7:35 PM IST

ABOUT THE AUTHOR

...view details