తెలంగాణ

telangana

ETV Bharat / sports

'భారత్​-పాక్​ మ్యాచ్​పై నిర్ణయం తీసుకోలేదు' - No plans to have Indo-Pak Oly qualifier in Europe if they draw each other: FIH

ఒలింపిక్స్​ క్వాలిఫయింగ్​లో భాగంగా భారత్​-పాకిస్థాన్​ మధ్య డ్రా పడితే పరిస్థితి ఏంటనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్​(ఎఫ్​ఐహెచ్​). సెప్టెంబర్​ 9న ఈ డ్రా జరగనుంది. ఈ రెండు దేశాల మ్యాచ్​లు యూరప్​ వేదికగా నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు వచ్చిన వార్తలను ఖండించింది ఎఫ్​ఐహెచ్​.

'ఇండో-పాక్​ హాకీ మ్యాచ్​పై నిర్ణయం తీసుకోలేదు'

By

Published : Sep 4, 2019, 6:01 AM IST

Updated : Sep 29, 2019, 9:18 AM IST

ఒలింపిక్స్​ క్వాలిఫయింగ్​లో భాగంగా భారత్​-పాక్​ మధ్య మ్యాచ్​లను ఎక్కడ నిర్వహించాలో ఇంకా ప్రణాళికలు రచించలేదనిఅంతర్జాతీయ హాకీ ఫెడరేషన్(ఎఫ్​ఐహెచ్) తెలిపింది​. రెండు దేశాల మధ్య ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా యూరప్​లో మ్యాచ్​ నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పాక్​ చెప్పడాన్ని ఖండించింది ఎఫ్​ఐహెచ్​.

"భారత్​, పాకిస్థాన్​ మ్యాచ్​లను యూరప్​లో నిర్వహించేందుకు ప్రణాళికలు ఇంకా సిద్ధం చేయలేదు. అయితే వాటిపై పాకిస్థాన్​ హాకీ ఫెడరేషన్​ చెప్పిన దానిలో నిజం లేదు. అది తప్పుడు వార్త."
-- అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్.

ఒలింపిక్స్​ క్వాలిఫయర్లుగా​ ఎవరెవరు ప్రత్యర్థులుగా బరిలోకి దిగుతారనేది సెప్టెంబర్​ 9న జరిగే డ్రాలో తేలనుంది. ఈ డ్రా స్విట్జర్లాండ్​ ల్యుసాన్నేలోని ఎఫ్​ఐహెచ్​ ప్రధాన కార్యాలయంలో జరుగుతుంది.14 జట్ల పేర్లతో 2020 టోక్యో ఒలింపిక్స్​ కోసం డ్రా తీస్తారు. రెండు జట్లు తలపడినప్పుడు ఏ దేశజట్టు మెరుగైన ర్యాంక్​లో ఉంటే ఆ దేశం మ్యాచ్​కు ఆతిథ్యం వహిస్తుంది. ప్రపంచ ర్యాంకింగ్స్​లో టాప్​-8లో నిలిచిన దేశాలు ఈ మ్యాచ్​లను నిర్వహిస్తాయి.

ఒలింపిక్​ క్వాలిఫయర్స్​ మెన్స్​, ఉమెన్స్​ జట్ల మ్యాచ్​లు అక్టోబర్​ చివరి వారంలో లేదా నవంబరు మొదటి వారంలో భారత్​లో జరగనున్నాయి. ఎఫ్​ఐహెచ్​ హాకీ ఒలింపిక్​ క్వాలిఫయర్​లో రెండు దేశాలు రెండేసి మ్యాచ్​లు ఆడతాయి. కాంటినెంటల్​ ఛాంపియన్​షిప్​, ఓషియానిక్​ కప్​లో సాధించిన ర్యాంక్​ల ఆధారంగా జట్లను రెండు భాగాలుగా విడదీస్తారు.

ప్రపంచ హాకీ ర్యాంకింగ్స్​లో భారత్​ 5వ స్థానం, పాకిస్థాన్​ 17వ స్థానంలో ఉంది. 2016 రియో ఒలింపిక్స్​కు పాక్​ జట్టు అర్హత సాధించలేకపోయింది.

Last Updated : Sep 29, 2019, 9:18 AM IST

ABOUT THE AUTHOR

...view details