తెలంగాణ

telangana

ETV Bharat / sports

కరోనాతో భారత హాకీ మాజీ ఆటగాడు మృతి - మాస్కో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్

భారత హాకీ మాజీ ఆటగాడు రవీందర్ పాల్ సింగ్ కొవిడ్​తో మృతిచెందారు. లఖ్​నవూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ravinder pal singh
రవీందర్ పాల్ సింగ్, హాకీ

By

Published : May 8, 2021, 10:40 AM IST

భారత హాకీ జట్టు మాజీ ఆటగాడు, 1980 మాస్కో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ రవీందర్ పాల్ సింగ్ కరోనాతో మృతిచెందారు. దాదాపు రెండు వారాల పాటు లఖ్​నవూ ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన శనివారం కన్నుమూశారు.

ఏప్రిల్ 24న కరోనా సోకడం వల్ల రవీందర్ వివేకానంద ఆసుపత్రిలో చేరారు. అయితే.. గురువారం ఆయనకు నెగెటివ్​గా తేలిందని కుటుంబసభ్యులు తెలిపారు. అయినప్పటికీ ఆరోగ్యం క్షీణించినందున ఆయనను వెంటిలెటర్​పై ఉంచినట్లు పేర్కొన్నారు. శనివారం ఆయన తుదిశ్వాస విడిచినట్లు స్పష్టం చేశారు.

1984 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్​లో సింగ్ భారత హాకీ జట్టు తరఫున ఆడారు. ఇవేకాక.. ఛాంపియన్స్ ట్రోఫీ కరాచీ(1980,1983), సిల్వర్ జూబ్లీ 10- నేషన్ కప్ హాంకాంగ్(1983), వరల్డ్ కప్ ముంబయి(1982), ఆసియా కప్ కరాచీ(1982)లో భారత జట్టులో ప్రాతినిథ్యం వహించారు.

ఇదీ చదవండి:'ఐపీఎల్​ నిర్వహణకు శ్రీలంక రెడీ'

ABOUT THE AUTHOR

...view details