తెలంగాణ

telangana

ETV Bharat / sports

హాకీ: జపాన్​పై విజయం.. ఫైనల్​కు భారత్ - olympic test evevt

ఒలింపిక్ టెస్ట్​ ఈవెంట్​లో టీమిండియా హాకీ ఆటగాళ్లు సత్తాచాటారు. జపాన్​తో జరిగిన పోరులో 6-3 తేడాతో విజయం సాధించి ఫైనల్​కు చేరారు. బుధవారం న్యూజిలాండ్​తో తుదిపోరులో తలడనుంది భారత్​.

హాకీ

By

Published : Aug 20, 2019, 12:40 PM IST

Updated : Sep 27, 2019, 3:37 PM IST

ఒలింపిక్ టెస్ట్ ఈవెంట్​లో భారత పురుషుల హాకీ జట్టు ఫైనల్​కు వెళ్లింది. జపాన్​పై 6-3 తేడాతో ఘనవిజయం సాధించింది. మన్​దీప్ సింగ్​ హ్యాట్రిక్ గోల్స్​తో సత్తాచాటాడు. గుర్సహిబిజిత్​ సింగ్, నీలకంఠ శర్మ, నీలమ్ సంజీప్​ చెరో గోల్​తో ఆకట్టుకున్నారు.

మొదటి నుంచి దూకుడుగా ఆడిన భారత ఆటగాళ్లు జపాన్​పై ఒత్తిడి తీసుకొచ్చారు. తొలి క్వార్టర్​లోనే మూడు గోల్స్​తో విజృంభించారు. నీలకంఠ శర్మతో మొదలైన ఈ విధ్వంసం.. నీలమ్ సంజీప్, మన్​దీప్ సింగ్​తో ముగిసింది.

రెండో క్వార్టర్​ ప్రారంభంలోనే జపాన్​ గోల్​ చేసినా.. ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. మరోసారి మన్​దీప్​ గోల్ చేసి భారత్​ను 4-1 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఆట సగం పూర్తికావడానికి ముందే మరోసారి బంతిని పోస్ట్​లోకి పంపించి హ్యాట్రిక్​ సాధించాడీ యువ ఆటగాడు.

జపాన్​ మరో రెండు గోల్స్​ సాధించినా.. టీమిండియా ఆటగాళ్లు పూర్తి ఆధిపత్యం వహించి జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్​లో గెలుపుతో ఫైనల్​లోకి అడుగుపెట్టింది భారత్​. బుధవారం జరిగే తుదిపోరులో న్యూజిలాండ్​తో తలపడనుంది. ఇంతకుముందు మ్యాచ్​లో కివీస్​పై భారత్​ కొద్దిలో ఓడిపోయింది.

ఇవీ చూడండి.. విలియమ్సన్​, ధనంజయల బౌలింగ్​ యాక్షన్​పై ఫిర్యాదు

Last Updated : Sep 27, 2019, 3:37 PM IST

ABOUT THE AUTHOR

...view details