తెలంగాణ

telangana

ETV Bharat / sports

అతిపెద్ద హాకీ స్టేడియానికి ఒడిశా సీఎం శంకుస్థాపన - అతిపెద్ద హాకీ స్టేడియం

దేశంలోనే అతిపెద్ద హాకీ స్టేడియాన్ని ఒడిశాలో నిర్మించనున్నారు. ఆ మైదానానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్​ శంకుస్థాపన చేశారు. 2023 హాకీ ప్రపంచకప్​ నాటికి ఆ స్టేడియం అందుబాటులోకి రానుంది.

largest hockey stadium in Rourkela
అతిపెద్ద హాకీ స్టేడియానికి ఒడిశా సీఎం శంకుస్థాపన

By

Published : Feb 16, 2021, 3:20 PM IST

దేశంలోనే అతిపెద్ద హాకీ స్టేడియంను ఒడిశాలోని రవుర్కెలాలో నిర్మించనున్నారు. 2023 హాకీ ప్రపంచ కప్‌ నాటికి స్టేడియం సిద్ధం కానుంది. స్టేడియం నిర్మాణానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ శంకుస్థాపన చేశారు. దేశంలోనే అతిపెద్దది కానున్న ఈ స్టేడియానికి స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా పేరు పెట్టనున్నట్లు సీఎం ప్రకటించారు.

బిజుపట్నాయక్‌ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ ప్రాంగణంలోని 15 ఎకరాలను ఈ మైదానం కోసం కేటాయించారు. 20 వేల మంది కూర్చునే సామర్థ్యం సహా ఇతర సదుపాయల్ని ఇందులో కల్పించనున్నారు.

స్టేడియం ఊహాచిత్రం
రవుర్కెలాలో నిర్మించనున్న హాకీ స్టేడియం
అతిపెద్ద హాకీ స్టేడియానికి ఒడిశా సీఎం శంకుస్థాపన
అతిపెద్ద హాకీ స్టేడియానికి ఒడిశా సీఎం శంకుస్థాపన

2023లో ఒడిశాలో జరగనున్న హాకీ ప్రపంచ కప్‌ను భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంతో పాటు రవుర్కెలాలోని బిర్సా ముండా స్టేడియంలో నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి:టెస్టు ఛాంపియన్​షిప్​: రెండో స్థానంలో టీమ్ఇండియా

ABOUT THE AUTHOR

...view details