రెండు రోజుల క్రితం అజ్లాన్ షా హాకీటైటిల్ కోసం దక్షిణ కొరియాతో తలపడిన భారత్ రెండు పాయింట్ల తేడాతో ఓడిపోయింది. షూటౌట్లో ఫలితం తేలిన ఈ మ్యాచ్‌లో ఓ పెనాల్టీ గోల్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. కొరియా కెప్టెన్ లీ నామ్ యంగ్ ...భారత గోల్ కీపర్ కిషన బీ పాఠక్‌ను బోల్తా కొట్టిస్తూ కళ్లు చెదిరే గోల్ చేశాడు.
గోల్‌తో బోల్తా కొట్టించాడు...కప్ ఎగరేసుకుపోయాడు
మార్చి 30న జరిగిన సుల్తాన్ అజ్లాన్ షా కప్ హాకీ ఫైనల్లో భారత్‌ను ఓడించి దక్షిణకొరియా కప్పు ఎగరేసుకుపోయింది. అయితే టైటిల్ పోరులో జరిగిన షూటౌట్లో కొరియా ఆటగాడు కొట్టిన గోల్ చర్చనీయాంశంగా మారింది.
గోల్‌తో బోల్తా కొట్టించాడు...కప్ ఎగరేసుకుపోయాడు
నిర్ణీత సమయంలో భారత్, దక్షిణ కొరియా మధ్య మ్యాచ్ 1-1తో సమమైంది. దీంతో షూటౌట్ నిర్వహించారు. అయితే భారత్ ఐదు ప్రయత్నాల్లో రెండే గోల్స్ చేయగలిగింది. అటు కొరియా మాత్రం 4 గోల్స్ చేసింది. ఫలితంగా 4-2తో ట్రోఫీని సొంతం చేసుకుంది.