తెలంగాణ

telangana

ETV Bharat / sports

అతిపెద్ద హాకీ స్టేడియం ఏడాదిలో సిద్ధం - 2023 హాకీ ప్రపంచకప్

ప్రపంచస్థాయి హాకీ స్టేడియాన్ని ఏడాదిలోగా నిర్మిస్తామని ఒడిశా ప్రధాన కార్యదర్శి సురేశ్ చంద్ర చెప్పారు. 20 వేల సీటింగ్​ సామర్థ్యంతో దేశంలో ఇది అతిపెద్ద హాకీ స్టేడియంగా అవతరించనుంది.

India's largest hockey stadium to be developed within a year
ఏడాదిలోగా ప్రపంచస్థాయి హాకీ స్టేడియం

By

Published : Jan 19, 2021, 10:37 PM IST

ఒడిశాలో నిర్మితమవుతున్న ప్రపంచస్థాయి హాకీ స్టేడియం.. మరో ఏడాదిలోగా పూర్తి కానుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేశ్ చంద్ర మహోపాత్ర మంగళవారం వెల్లడించారు.

రూర్కెలాలోని బిజు పట్నాయక్ సాంకేతిక విశ్వవిద్యాలయ (బీపీటీయూ) క్యాంపస్​లో ఈ స్టేడియాన్ని నిర్మించనున్నారు. 2023లో జరిగే పురుషుల హాకీ ప్రపంచకప్​నకు ఇది రెండో వేదిక కానుంది. టోర్నీని భువనేశ్వర్​లోనూ నిర్వహించనున్నారు.

"ఇది భారత్​లోనే పెద్ద హాకీ స్టేడియంగా నిలవబోతోంది. బీపీటీయూ క్యాంపస్​లో దీనిని నిర్మిస్తున్నాం. మూడు, నాలుగు నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. ఏడాదిలోగా పూర్తవుతాయి"

- సురేశ్ చంద్ర మహోపాత్ర, ఒడిశా ప్రధాన కార్యదర్శి

పార్కింగ్ సహా ఇతర సదుపాయాల కల్పనకు కూడా పనులు అప్పుడే ప్రారంభమవుతాయని సీఎస్ వెల్లడించారు. 15 ఎకరాల్లో 20 వేల సీటింగ్​ సామర్థ్యంతో ఈ స్టేడియాన్ని రూపొందిస్తున్నారు.

ఇదీ చూడండి:భారత హాకీ దిగ్గజం మైఖేల్ కిండో కన్నుమూత

ABOUT THE AUTHOR

...view details