జపాన్ వేదికగా శనివారం ప్రారంభమైన ఒలింపిక్ టెస్ట్ ఈవెంట్లో భారత మహిళా హాకీ జట్టు శుభారంభం చేసింది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జపాన్‌పై 2-1తేడాతో విజయం సాధించింది. పురుషుల జట్టు తన మొదటి మ్యాచ్ మలేసియాతో ఆడనుంది.
ఐదో ర్యాంకులోని భారత పురుషుల హాకీ జట్టు, 12వ ర్యాంకులోని మలేసియా.. ఈ టోర్నీలో ఫేవరేట్‌గా బరిలోకి దిగాయి. న్యూజిలాండ్(8వ ర్యాంకు)తో ఆదివారం, చివరి మ్యాచ్‌లో జపాన్ (16వ ర్యాంకు)తో తలపడనుంది భారత జట్టు.