తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఖేల్​రత్నకు రాణి రాంపాల్​ నామినేట్ - ది ఇయర్ వరల్డ్​ గేమ్స్​ అథ్లెట్

భారతదేశ అత్యున్నత క్రీడా పురస్కారంగా భావించే రాజీవ్​ గాంధీ ఖేల్​రత్న అవార్డుకు భారత హాకీ మహిళా జట్టు కెప్టెన్​ రాణి రాంపాల్​ను సిఫారసు చేసింది హాకీ ఇండియా. అర్జున, ద్రోణాచార్య పురస్కారాలకూ పేర్లను కేంద్రానికి పంపింది.

Indian women's team captain Rani recommended for Khel Ratna
ఖేల్​రత్నకు రాణి రాంపాల్​ను ఎంపిక చేసిన హాకీ ఇండియా

By

Published : Jun 2, 2020, 3:06 PM IST

క్రీడా రంగంలో ప్రతిష్టాత్మక రాజీవ్​గాంధీ ఖేల్​రత్న, ద్రోణాచార్య, అర్జున పురస్కారాల కోసం పేర్లను తాజాగా ప్రకటించింది హాకీ ఇండియా. ఖేల్​రత్నకు జాతీయ మహిళా జట్టు కెప్టెన్ రాణి రాంపాల్​ను నామినేట్ చేసింది. అర్జున అవార్డు కోసం వందనా కటారియా, మోనికా, హర్మన్​ప్రీత్​ సింగ్​లను సిఫారసు చేసింది.

ధ్యాన్ చంద్​ అవార్డు కోసం, ఫెడరేషన్​ భారత మాజీ హాకీ ప్లేయర్లు ఆర్​.పి. సింగ్​, తుషార్​ ఖండ్కర్లను.. ద్రోణాచార్య పురస్కారానికి కోచ్​లు బి.జె కరియప్ప, రోమేశ్ పఠానియాలను నామినేట్ చేసింది.

భారత హాకీ చరిత్రలో 'రాణి'

2017లో జరిగిన మహిళల ఆసియా కప్​లో అద్భుత విజయాలకు తోడు​, 2018లో జరిగిన ఆసియన్ గేమ్స్​లో రజతం దక్కించుకోవడంలో రాణి ప్రధాన పాత్ర పోషించింది. టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించడంలోనూ మహిళల జట్టు కెప్టెన్ రాంపాల్​ది కీలకపాత్ర. 'ది ఇయర్ వరల్డ్​ గేమ్స్​ అథ్లెట్​'గా పేరు తెచ్చుకున్న తొలి భారతీయురాలు రాణి. ఈ క్రీడాాకారిణి ఇప్పటికే అర్జున అవార్డు(2016), పద్మశ్రీ (2019) పురస్కారాలను అందుకుంది.

భారత క్రీడా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ప్యానెల్.. అవార్డుల పోటీలో వివిధ జాతీయ సమాఖ్యల నుంచి వచ్చిన నామినేషన్లను షార్ట్ లిస్ట్ చేస్తుంది. ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారు.

ఇదీ చూడండి... ఖేల్​రత్నకు భారత అగ్రశేణి బాక్సర్ల పేర్లు​

ABOUT THE AUTHOR

...view details