తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఎఫ్​ఐహెచ్'​ విజేతగా భారత హాకీ మహిళల జట్టు - Japan

భార‌త హాకీ మ‌హిళల జ‌ట్టు అనూహ్య విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. అంచ‌నాల‌కు మించి రాణించి.. జపాన్​లో జరిగిన మహిళా హాకీ సిరీస్​ 'ఎఫ్​ఐహెచ్'​ టైటిల్​ గెలుచుకుంది. ఫైనల్లో జపాన్​పై 3-1 తేడాతో అద్భుత విజ‌యాన్ని అందుకుంది. మహిళా జట్టుకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు.

'ఎఫ్​ఐహెచ్'​ విజేతగా భారత హాకీ మహిళల జట్టు

By

Published : Jun 23, 2019, 10:03 PM IST

జ‌పాన్‌లోని హిరోషిమాలో జరిగిన మహిళా హాకీ సిరీస్ ఎఫ్​ఐహెచ్​ ఫైనల్స్​లో భార‌త హాకీ జ‌ట్టు జపాన్​పై విజయం సాధించింది. ఆదివారం జ‌రిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ 3-1 గోల్స్‌ తేడాతో బ‌ల‌మైన జపాన్​ జ‌ట్టును ఓడించింది.

ఆట ఆరంభ‌మైన 3వ నిమిషంలోనే భారత కెప్టెన్​ రాణి గోల్​ చేసింది. అయితే 11వ నిమిషంలో జపాన్​ గోల్​ చేసి స్కోరు సమం చేసింది. 45, 60వ నిమిషంలో గుర్జిత్​ కౌర్ మెరుపులాంటి గోల్స్ కొట్టి భారత్​కు తిరుగులేని విజయాన్నిచ్చింది.​ కెప్టెన్​ రాణి టోర్నీలో ఉత్తమ ప్లేయర్​ అవార్డు గెలుచుకుంది.

ఈ టోర్నీ ఫైనల్​కు చేరినప్పుడే ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌ బెర్త్‌ను సుస్థిరం చేసుకుంది భారత మహిళా జట్టు.

అధ్భుత విజయం...

ప్రధాని మోదీ ట్వీట్

భారత హాకీ మహిళల జట్టు విజయంపై ప్రధాని నరేంద్రం మోదీ హర్షం వ్యక్తం చేశారు. జట్టుకు అభినందనలు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details