తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఒలింపిక్స్​లో బలమైన జట్లతో భారత్ హాకీ జట్టు ఢీ - poola indian hockey team

టోక్యో ఒలింపిక్స్​లో పూల్-ఏలో చోటు దక్కించుకుంది భారత పురుషుల హాకీ జట్టు. ఇందులో ఉన్న అర్జెంటీనా, స్పెయిన్, న్యూజిలాండ్​లతో తలపడనుంది. భారత మహిళల జట్టు కూడా పూల్-ఏలోనే ఆడనుంది.

భారత హాకీ జట్టు

By

Published : Nov 24, 2019, 9:31 AM IST

Updated : Nov 24, 2019, 10:25 AM IST

వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్​లో భారత పురుషుల హాకీ జట్టుకు పూల్-ఏ​లో చోటు దక్కింది. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాతో పాటు స్పెయిన్, న్యూజిలాండ్, ఆతిథ్య జపాన్ లాంటి శక్తిమంతమైన టీమ్​లతో హాకీ టీమిండియా తలపడనుంది.

పూల్​-బిలో బెల్జియం, నెదర్లాండ్స్​, జర్మనీ, గ్రేట్ బ్రిటన్, కెనడా, దక్షిణాఫ్రికా జట్లు ..విశ్వక్రీడల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి.

ప్రపంచ ఐదో ర్యాంకులో ఉన్న భారత్.. ఈ నెల ప్రారంభంలో జరిగిన అర్హత పోటీల్లో రష్యాను 11-3 తేడాతో ఓడించి ఒలింపిక్స్​ బెర్తు ఖరారు చేసుకుంది.

అమ్మాయిలు కూడా పూల్​-ఏలోనే

భారత మహిళా హాకీ జట్టు.. పూల్-ఏలోనే చోటు దక్కించుకుంది. ఈ పూల్​లో డిఫెండింగ్ ఛాంపియన్ గ్రేట్ బ్రిటన్, ప్రపంచ నెంబర్ వన్ నెదర్లాండ్స్​, జర్మనీ, ఐర్లాండ్, దక్షిణాఫ్రికా లాంటి బలమైన జట్లను ఢీ కొట్టనుంది.

భారత మహిళా హాకీ జట్టు

మహిళల పూల్​-బిలో ఆస్ట్రేలియా, అర్జెంటీనా, న్యూజిలాండ్, స్పెయిన్, చైనా, జపాన్​ జట్లు పరస్పరం తలపడనున్నాయి. ప్రపంచ 9వ ర్యాంకులో ఉన్న భారత మహిళల జట్టు.. అర్హత పోటీల్లో అమెరికాపై 6-5 తేడాతో నెగ్గి ఒలింపిక్స్​లో చోటు దక్కించుకుంది.

అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్(ఎఫ్ఐహెచ్) ర్యాంకింగ్స్ ఆధారంగా టాప్-16లో నిలిచిన జట్లు.. ఒలింపిక్స్​లో తలపడతాయి.

వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్​లో జులై 25 నుంచి ఆగస్టు 7వరకు హాకీ మ్యాచ్​లు జరగనున్నాయి.

ఇదీ చదవండి: పింక్ టెస్టు: దాదాపై మాజీల ప్రశంసల వర్షం

Last Updated : Nov 24, 2019, 10:25 AM IST

ABOUT THE AUTHOR

...view details