తెలంగాణ

telangana

ETV Bharat / sports

2023 హాకీ ప్రపంచకప్​ ఆతిథ్యానికి భారత్​ ఆసక్తి..! - india want to host 2023 hockey world cup

2023 పురుషుల హాకీ ప్రపంచకప్​ నిర్వహించేందుకు భారత్ బిడ్ దాఖలు చేసింది. మరో రెండు దేశాలూ ఇందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి.

హాకీ

By

Published : Oct 18, 2019, 6:41 AM IST

అన్నీ అనుకున్నట్లు జరిగితే 2023 హాకీ ప్రపంచకప్​ భారత్​లో జరగొచ్చు. అవునూ.. వచ్చే పురుషుల హాకీ ప్రపంచకప్​ను నిర్వహించేందుకు ఇండియా ఆసక్తి కనబరుస్తోంది. అందుకోసం బిడ్​ దాఖలు చేసింది.

ఇప్పటికే భారత్​ మూడుసార్లు హాకీ ప్రపంచకప్​నకు ఆతిథ్యం ఇచ్చింది. 2023లో జనవరి 13 నుంచి 29 వరకు ఈ టోర్నీని నిర్వహించేందుకు ముందుకొచ్చింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ హాకీ సమాఖ్య తెలిపింది. జులై 1-17 (2022) విండోలో టోర్నీని జరిపేందుకు బెల్జియం, మలేసియా కూడా బిడ్​ దాఖలు చేశాయి.

మహిళా హాకీ ప్రపంచకప్​ నిర్వహించేందుకు ఐదు దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. జర్మనీ, స్పెయిన్, నెదర్లాండ్స్​ జులై 1-17 (2022)విండోలో టోర్నీని జరిపేందుకు ముందుకొచ్చాయి. మలేసియా, న్యూజిలాండ్​ జనవరి 13-29 (2023) సమయంలో నిర్వహణ కోసం బిడ్​ దాఖలు చేశాయి.

ఈ టోర్నీ జరిపేందుకు ఆసక్తికనబర్చిన దేశాలకు కృతజ్ఞతలు తెలిపింది అంతర్జాతీయ హాకీ సమాఖ్య. వచ్చే నెల 19న ఆతిథ్య దేశాలను ప్రకటిస్తామని స్పష్టం చేసింది.

ఇవీ చూడండి.. భారత్ మూడో టెస్టు కోసం సైనికులకు ఉచిత టికెట్లు

ABOUT THE AUTHOR

...view details