భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ సహా మరో ముగ్గురు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. బెంగళూరులో నిర్వహించిన జాతీయ శిక్షణ శిబిరానికి చేరే ముందు చేసిన పరీక్షల్లో వీరికి పాజిటివ్ నిర్ధరణ అయినట్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) శుక్రవారం తెలిపింది.
భారత పురుషుల హాకీ జట్టులో కరోనా కలకలం - hockey team corona test
టీమ్ఇండియా హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్‌తో పాటు ముగ్గురు ఆటగాళ్లకు కరోనా సోకింది. ప్రస్తుతం వారిని స్వీయ నిర్బంధంలో ఉంచినట్లు అధికారులు తెలిపారు.
భారత పురుషుల హాకీ జట్టు
మన్‌ప్రీత్‌తో పాటు, డిఫెండర్ సురందర్ కుమార్, జస్కరన్ సింగ్, వరుణ్ కుమార్‌లకు మహమ్మారి సోకింది.
"ప్రస్తుతం నేను ఎస్ఐఏ క్యాంప్‌లో స్వీయ నిర్బంధంలో ఉన్నా. అధికారులు పరిస్థితులపై చూపిస్తున్న శ్రద్ధ పట్ల చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నాకు బాగానే ఉంది.. త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా" అంటూ మన్‌ప్రీత్ సింగ్ ట్విట్టర్ వేదికగా తెలిపాడు.
Last Updated : Aug 7, 2020, 10:19 PM IST