మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలో భారత పురుషుల హాకీ జట్టు.. టోక్యో ఒలింపిక్స్‌లో కచ్చితంగా పతకం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు మాజీ హాకీ కెప్టెన్ సర్దార్ సింగ్. 1980 మాస్కో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు చివరిసారిగా బంగారు పతకాన్ని సాధించింది. అప్పటి నుంచి 8 విశ్వక్రీడల్లో పాల్గొన్నా.. పతకం సాధించడంలో 'మెన్ ఇన్ బ్లూ' విఫలమైంది.
"314 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడినా.. ఒలింపిక్స్‌లో పతకాన్ని సాధించలేకపోయినందుకు చింతిస్తున్నాం. కానీ, ప్రస్తుత జట్టు గతేడాది నుంచి ప్రదర్శనలో బలంగా ఎదుగుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో అంతర్జాతీయ హాకీ సమాఖ్య నిర్వహించిన లీగ్‌లో ఆడిన విధానం చూస్తే.. టోక్యో ఒలింపిక్స్‌లో పతకాన్ని సాధించగలరన్న నమ్మకం మరింత బలపడింది.