అర్జెంటీనా వేదికగా జరిగిన ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్‌లో భారత హాకీ జట్టు విజయం సాధించింది. ఆతిథ్య అర్జెంటీనా టీమ్‌పై 3-0 తేడాతో గెలుపొందింది. భారత ప్లేయర్లలో హర్మన్‌ప్రీత్ సింగ్(11వ నిమిషంలో), లలిత్ ఉపాధ్యాయ్(25వ నిమిషంలో), మన్దీప్ సింగ్(58వ నిమిషంలో) గోల్స్ సాధించారు.
ఇదీ చదవండి:'ఫిట్నెస్తో శారీరక, మానసిక సమస్యలకు చెక్'
తొలి అర్ధ భాగంలో అర్జెంటీనా ఆటగాళ్లు భారత్‌పై పైచేయి సాధించేలా కనిపించారు. కెరీర్లో 50వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న క్రిషన్ బహదూర్ పాఠక్.. మూడు గోల్స్‌ను కాపాడాడు. ఆ తర్వాత భారత్ పుంజుకుంది. 11వ నిమిషంలో హర్మన్ తొలి గోల్ కొట్టాడు. రెండు రోజుల వ్యవధిలో హర్మన్‌ప్రీత్‌కు ఇది వరుసగా మూడో గోల్.
ప్రస్తుత విజయంతో భారత్ లీగ్ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. ఏప్రిల్ 13, 14న ఆతిథ్య జట్టుతోనే భారత్ మరో రెండు మ్యాచ్‌లు ఆడనుంది.
ఇదీ చదవండి:'ఐపీఎల్‌లోనూ దేశవాళీ ఫామ్‌ను కొనసాగిస్తా'