తెలంగాణ

telangana

By

Published : Sep 10, 2019, 9:26 AM IST

Updated : Sep 30, 2019, 2:24 AM IST

ETV Bharat / sports

హాకీ క్వాలిఫయర్స్​: భారత్​ ప్రత్యర్థులు వీరే

టోక్యో హాకీ ఒలింపిక్స్​ క్వాలిఫయర్స్​లో భాగంగా భారత్​ ఎవరితో తలపడుతుందన్న ఉత్కంఠ తీరిపోయింది. ఫైనల్ రౌండ్​లో భారత్​ రెండు జట్లకు డ్రా ఎదురైంది. అక్టోబర్​ 27 నుంచి నవంబర్​ 3 మధ్య జరిగే క్వాలిఫయర్​ మ్యాచ్​ల్లో  భారత పురుషుల జట్టు రష్యాతో, మహిళల జట్టు అమెరికాతో తలపడనుంది.

హాకీ క్వాలిఫయర్స్

2020టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయర్స్​ కోసం పోటీ పడుతోన్న భారత్​కు మిశ్రమ డ్రా పడింది. పాకిస్థాన్​తో మ్యాచ్​ పడే అవకాశంపై ముందు నుంచి కొనసాగుతున్న ఉత్కంఠ తొలగిపోయింది. సోమవారం తీసిన డ్రాలో భారత పురుషుల జట్టుకు రష్యాతో మ్యాచ్​ పడింది. మహిళా జట్టు అమెరికాతో పోటీపడనుంది. రెండు మ్యాచ్​లు భువనేశ్వర్​ వేదికగా జరగనున్నాయి.

తాజా డ్రాపై స్పందించిన పురషుల హాకీ జట్టు కెప్టెన్​ మన్​ప్రీత్​ సింగ్... క్వాలిఫయర్​ మ్యాచ్​లకు సిద్ధంగా ఉన్నామన్నాడు. అయితే, రష్యాను తేలికగా తీసుకోలేమని అభిప్రాయపడ్డాడు.

"ఏ జట్టునూ తేలికగా తీసుకోలేం. ముఖ్యంగా రష్యా ఆటతీరు, సామర్థ్యం మాకు పూర్తిగా తెలుసు. ఈ మ్యాచ్​ ఒలింపిక్స్​కు​ క్వాలిఫైయర్​ రౌండ్​ కావటం వల్ల వాళ్లు కచ్చితంగా బాగా ఆడాలనుకుంటారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంపైనే మా దృష్టి ఉంది."
-మన్​ప్రీత్ ​సింగ్, పురషుల హాకీ జట్టు కెప్టెన్.

నవంబర్​ 1, 2 తేదీల్లో మన్​ప్రీత్​ బృందం భువనేశ్వర్​ వేదికగా రష్యాతో రెండు మ్యాచ్​లు ఆడనుంది. ఈ మ్యాచ్​ గెలిచిన జట్టు నేరుగా టోక్కో బెర్తు ఖాయం చేసుకుంటుంది. ప్రపంచ ర్యాంకింగ్స్​లో భారత్​ 5వ ర్యాంకులో ఉండగా.. రష్యా 22వ స్థానంలో ఉంది. భువనేశ్వర్​లోనే నవంబర్​ 1,2 తేదీల్లో జరిగే పోరులో మహిళా టీమిండియా, అమెరికా జట్లు తలపడనున్నాయి. ఇందులో భారత్​ 9, అమెరికా 13వ స్థానాల్లో ఉన్నాయి.

పురుష జట్ల డ్రా వివరాలు...

1.జర్మనీ, ఆస్ట్రేలియా

2.భారత్​, రష్యా

3.నెదర్లాండ్​, పాకిస్థాన్​

4.స్పెయిన్​, ఫ్రాన్స్​

5.కెనడా, ఐర్లాండ్​

6.బ్రిటన్​, మలేషియా

7. న్యూజిలాండ్​, కొరియా

భారత పురుషుల హాకీ జట్టు

మహిళా జట్ల డ్రా వివరాలు...

1.జర్మనీ, ఇటలీ

2.ఆస్ట్రేలియా, రష్యా

3. బ్రిటన్​, చిలీ

4. భారత్​, అమెరికా

5. చైనా, బెల్జియం

6. ఐర్లాండ్​, కెనడా

7. స్పెయిన్​, కొరియా

8. కెనడా, ఐర్లాండ్​

9. బ్రిటన్​, మలేషియా

10. న్యూజిలాండ్​, కొరియా

భారత మహిళల హాకీ జట్టు

ఇదీ చూడండి: బంగ్లాదేశ్​పై అఫ్గాన్​ సంచలన విజయం

Last Updated : Sep 30, 2019, 2:24 AM IST

ABOUT THE AUTHOR

...view details