hockey junior world cup 2021: జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో వరుసగా రెండో సారి జయకేతనం ఎగరేయాలనే పట్టుదలతో బరిలోకి దిగిన భారత జట్టుకు జర్మనీ అడ్డుతగిలింది. శుక్రవారం జరిగిన సెమీస్‌లో జర్మనీ జట్టు ముందు భారత కుర్రాళ్లు తేలిపోయారు. సెమీస్‌లో 2-4తో జర్మనీ చేతిలో ఓటమి పాలయ్యారు.
ఆరంభంలో 1-0 ఆధిక్యాన్ని భారత జట్టు సాధించినప్పటికీ.. రెండో క్వార్టర్లో జర్మనీ ఆటగాళ్లు మెరుపు వేగంగా మూడు గోల్స్ సాధించారు. ఈ క్రమంలో విరామం సమయానికి భారత జట్టు 1-4తో వెనకబడిపోయింది. చివరి 30 నిమిషాలు తీవ్రంగా శ్రమించినప్పటికీ చివరి నిమిషంలో ఒక్క గోల్ మాత్రమే చేయగలిగింది. మూడో స్థానం కోసం ఫ్రాన్స్‌తో ఆదివారం తలపడనుంది.