తెలంగాణ

telangana

ETV Bharat / sports

Hockey India: కామన్వెల్త్ క్రీడల నుంచి వైదొలిగిన హాకీ ఇండియా - భారత పురుషుల హాకీ జట్టు

ఇంగ్లాండ్​లోని బర్మింగ్​హామ్ వేదికగా వచ్చే ఏడాది జరగనున్న​ కామన్వెల్త్​ క్రీడల నుంచి తప్పుకుంటున్నట్లు హాకీ ఇండియా (Hockey India) ప్రకటించింది. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘానికి లేఖ ద్వారా వివరణ ఇచ్చింది హాకీ ఇండియా.

Hockey India
Hockey India

By

Published : Oct 5, 2021, 8:29 PM IST

Updated : Oct 5, 2021, 8:54 PM IST

ఇంగ్లాండ్​లోని బర్మింగ్​హామ్​ వేదికగా వచ్చే ఏడాది జరగనున్న కామన్వెల్త్​ క్రీడల్లో (Commonwealth Games 2022) హాకీ పోటీల నుంచి తప్పుకుంది (Hockey India) భారత్. కొవిడ్ ఆందోళనలు సహా భారత ప్రయాణికులపై యూకే వివక్షపూరిత క్వారంటైన్ నిబంధనలే (UK Quarantine Rules) అందుకు కారణమని హాకీ ఇండియా తెలిపింది. ఇవే కారణాలతో భువనేశ్వర్​లో జరగనున్న పురుషుల జూనియర్ ప్రపంచకప్​ నుంచి ఇంగ్లాండ్​ తప్పుకొన్న మరుసటి రోజే హాకీ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని హాకీ ఇండియా (Hockey India) అధ్యక్షుడు జ్ఞానేంద్రో నిన్గోంబమ్.. భారత ఒలింపిక్ సంఘం(ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్ బత్రాకు లేఖలో తెలిపారు.

బర్మింగ్​హామ్​ (Birmingham 2022 Commonwealth Games) పోటీలు వచ్చే ఏడాది జులై 28 నుంచి ఆగస్టు 8 మధ్య జరగనున్నాయి. ఆ తర్వాత నెల రోజులకే(సెప్టెంబర్​ 10-25) చైనాలోని హాంగ్జూ వేదికగా ఆసియా గేమ్స్ (Asian Games)​ ప్రారంభం కానున్నాయి. "ఈ రెండు టోర్నీల మధ్య కేవలం 32 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. పైగా 2024 పారిస్ ఒలింపిక్స్​కు ఆసియా గేమ్స్​ అర్హత టోర్నీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కరోనా కారణంగా తీవ్రంగా ప్రభావితమైన యూకేకు ఆటగాళ్లకు పంపించి రిస్క్​ చేయదలచుకోలేం" అని హాకీ ఇండియా లేఖలో పేర్కొంది.

ఇదీ చూడండి:Corona Effect: భారత్​లో జరగాల్సిన కామన్వెల్త్ గేమ్స్ రద్దు

Last Updated : Oct 5, 2021, 8:54 PM IST

ABOUT THE AUTHOR

...view details