తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఒలింపిక్ టెస్ట్ ఈవెంట్​కు​ మహిళా హాకీ జట్టు ఇదే - hockey

'టోక్యో ఒలింపిక్స్'​ టెస్ట్ ఈవెంట్​కు 18 మందితో కూడిన మహిళా జట్టును ప్రకటించింది హాకీ ఇండియా. జపాన్​లో ఎఫ్ఐహెచ్​ సిరీస్​ ఫైనల్లో ఆడిన జట్టునే స్వల్ప మార్పులతో ఎంపిక చేసింది.

మహిళా హాకీ జట్టు

By

Published : Jul 26, 2019, 5:48 PM IST

'2020 టోక్యో ఒలింపిక్స్'​ టెస్ట్​ ఈవెంట్​కు మహిళా జట్టును ప్రకటించింది హాకీ ఇండియా. 18 మంది సభ్యులతో కూడిన టీమ్​ను ఎంపిక చేసింది. అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్(ఎఫ్​ఐహెచ్) సిరీస్​లో ఫైనల్ ఆడిన జట్టులో రెండు మార్పులు చేసి ఈ బృందాన్ని ఎంపిక చేసింది.

సునీత లకారా, జ్యోతి స్థానంలో యువ క్రీడాకారిణులు షర్మిలా దేవి, రీనా ఖోఖార్​కు అవకాశం కల్పించారు. గాయం నుంచి కోలుకున్న రీనా అధ్భుత పామ్​లో ఉంది. ఈ పోటీలతో జాతీయ జట్టు తరపున అరంగేట్రం చేయనుంది షర్మిల.

"టోక్యో ఒలింపిక్స్​ టెస్ట్​ ఈవెంట్​లో తొలి మూడు స్థానాల్లో నిలవాలనుకుంటున్నాం. అందుకే 18 మందితో కూడిన జట్టును ఎంపిక చేశాం. ఒలింపిక్ ప్రమాణాల ప్రకారం 16 మందే ఆడతారు." - స్జోర్డ్ మరిజ్నే, భారత మహిళా జట్టు కోచ్​.

భారత హాకీ మహిళా జట్టు ఇదే..

గోల్ కీపర్లు: సవిత(వైస్ కెప్టెన్), రజని

డిఫెండర్లు: దీప్ గ్రేస్ ఎక్కా, రీనా ఖోఖార్, గుర్జిత్ కౌర్, సలీమ, నిషా

మిడ్ ఫీల్డర్లు: సుశీలా చాను, నిక్కీ ప్రధాన్, మోనిక, లిలిమా మిన్జ్, నేహా గోయల్

ఫార్వర్డ్ ప్లేయర్లు: రాణి(కెప్టెన్), నవ్​నీత్​ కౌర్​, వందన కటారియా, లాల్​రెమ్​సైనీ, నవజోత్ కౌర్, షర్మిలా దేవి.

ఎఫ్ఐహెచ్​ ర్యాంకింగ్స్​లో పదో స్థానంలో ఉన్న భారత్ బలమైన జట్లతో తలపడనుంది. రెండో ర్యాంకులో ఉన్న ఆస్ట్రేలియా, చైనా(11), ఆతిథ్య జట్టు జపాన్(14)లతో పోటీపడనుంది. ఆగస్టు 17 నుంచి 21 వరకు ఈ పోటీ జరగనున్నాయి.

ఇది చదవండి: 'ఎఫ్​ఐహెచ్'​ విజేతగా భారత హాకీ మహిళల జట్టు

ABOUT THE AUTHOR

...view details