వయసు సంబంధిత సమస్యలతో భారత హాకీ దిగ్గజం కేశవ్ చంద్ర దత్(95) (Keshav Chandra Datt) కన్నుమూశారు. ఆయన మృతి పట్ల హాకీ ఇండియా (Hockey India)తో పాటు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) (Sports Authority of India) సంతాపం ప్రకటించాయి.
ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్..
1925 డిసెంబర్ 29న ప్రస్తుత పాకిస్థాన్‌లోని లాహోర్‌లో చంద్ర దత్ జన్మించారు. 1947లో జరిగిన తూర్పు ఆఫ్రికా పర్యటనలో దిగ్గజ హాకీ ఆటగాడు ధ్యాన్‌చంద్ సారథ్యంలో భారత జట్టుకు ఆడారు. స్వాతంత్య్రానంతరం లండన్ వేదికగా జరిగిన 1948 ఒలింపిక్స్ (London Olympics)లో గోల్డ్ మెడల్ గెలిచిన జట్టులో చంద్ర దత్ సభ్యుడు. వెంబ్లే స్టేడియంలో జరిగిన ఈ మెగా ఈవెంట్ ఫైనల్లో బ్రిటన్ను దాని సొంతగడ్డపై 4-0 తేడాతో ఓడించింది భారత్. హెల్సింకీ వేదికగా జరిగిన 1952 ఒలింపిక్స్ (Hockey India)లోనూ కేశవ్ సభ్యుడు. ఈ ఈవెంట్లో నెదర్లాండ్స్ 6-1తో గెలుపొందిన భారత్.. స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.