దేశంలో క్రీడా ప్రాముఖ్యతను పెంచడం, నైపుణ్యం ఉన్న క్రీడాకారులను ప్రోత్సహిం చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ హాకీ క్రీడాకారుడు.. మేజర్ ధ్యాన్ చంద్ సేవలను గుర్తుచేసిన ప్రధాని ఆయన చేసిన అద్భుతాలను ఎప్పటికీ మరచిపోలేమన్నారు. వివిధ క్రీడల ద్వారా ఎందరో క్రీడాకారులు దేశ ఖ్యాతిని పెంపొందించారన్న మోదీ.. వారి సంకల్పం అద్భుతంగా ఉందని కొనియాడారు.
దేశానికి మేజర్ ధ్యాన్‌చంద్ సేవలు చిరస్మరణీయం - జాతీయ క్రీడా దినోత్సవం
జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్‌చంద్ సేవలను గుర్తు చేసుకున్నారు ప్రధాని నరేంద్రమోదీ. వివిధ ఆటల ద్వారా క్రీడాకారులు దేశ ఖ్యాతిని పెంచారని కొనియాడారు. దేశంలో నైపుణ్యం ఉన్న ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా మోదీ తెలిపారు.
దేశానికి మేజర్ ధ్యాన్ చంద్ సేవలు చిరస్మరణీయం
ఆటలు, శారీరక శ్రమను రోజూవారీ కార్యక్రమాల్లో భాగం చేసుకోవాలన్న ప్రధాని.. తద్వారా ఎన్నో సత్ఫలితాలు వస్తాయని ప్రధాని పేర్కొన్నారు. క్రీడాకారుల విజయానికి సహకరించిన వారి కుటుంబాలు, కోచ్‌లు, సిబ్బంది సహకారాన్ని ప్రశంసించారు.