Goalkeeper PR Sreejesh: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన భారత పురుషుల హాకీ జట్టు గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేష్.. ఓ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని దక్కించుకునేందుకు రేసులోకి వచ్చాడు. వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు అతడు నామినేట్ అయ్యాడు. ఆన్లైన్ ఓటింగ్ ప్రక్రియ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. జనవరి 10 నుంచి 31 వరకు ఈ ప్రక్రియ జరగనుంది.
ఒకవేళ ఈ అవార్డు శ్రీజేష్‌కు వరిస్తే.. భారత్ తరఫున ఈ పురస్కారాన్ని అందుకున్న రెండో హాకీ ప్లేయర్‌గా నిలుస్తాడు. అంతకుముందు మహిళల హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్ ఈ ఘనత దక్కించుకుంది.