తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధ్యాన్​చంద్​కు ఈ సారైనా భారతరత్న ఇస్తారా? - ధ్యాన్​చంద్​

భారత హాకీ దిగ్గజం.. మేజర్​ ధ్యాన్​చంద్​కు భారతరత్న ఇవ్వాలని మాజీ, ప్రస్తుత హాకీ ఆటగాళ్లు డిమాండ్​ చేశారు. ఈ ఏడాదైనా ఆయనకు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును ప్రకటించి నిజమైన నివాళి అర్పించాలని అన్నారు.

Major Dhyan Chand
మేజర్​ ధ్యాన్​చంద్​

By

Published : Aug 23, 2020, 4:12 PM IST

Updated : Aug 23, 2020, 4:20 PM IST

హాకీ దిగ్గజం ధ్యాన్​చంద్​ పుట్టినరోజైన ఆగస్టు 29న ప్రతిఏటా జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటారు. క్రీడల్లో అసాధారణ ప్రతిభ చూపిన వారిని అత్యున్నత పురస్కారాలతో కేంద్రం ఆ రోజు సత్కరిస్తుంది. ఈ ఏడాదితో ధ్యాన్​చంద్ జన్మించి 115 వసంతాలు పూర్తవనున్నాయి. ఈ క్రమంలోనే దేశానికి ఎంతో పేరు తీసుకొచ్చిన మేజర్​ ధ్యాన్​చంద్​కు భారతరత్న ప్రకటించాలన్న అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ అవార్డును ఆయనకు ప్రకటించి నిజమైన నివాళి అర్పించాలని ప్రస్తుత, మాజీ హాకీ ఆటగాళ్లుడిమాండ్​ చేశారు.

ప్రముఖ ఆటగాళ్లుగుర్​బుక్స్​ సింగ్​, హర్బిందర్​ సింగ్​, అశోక్​ కుమార్​ సహా యువరాజ్​ వాల్మీకి వర్చువల్​ సమావేశం ద్వారా ఈ విషయమై చర్చించారు. ధ్యాన్​చంద్​కు భారత రత్న ప్రకటించాలంటూ టీమ్​ఇండియా మాజీ సారథి సౌరభ్​ గంగూలీ, నటుడు బాబుషాన్​ మోహంతి, రాచెల్​ ఆధ్వర్యంలో గతేడాది నుంచి డిజిటల్​ ప్రచారం ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఈ చర్చ సాగింది.

భారత్‌ తరఫున 1928, 1932, 1936 ఒలింపిక్స్​లో పాల్గొనిస్వర్ణపతకాలందించారు ధ్యాన్‌ చంద్‌. క్రీడారంగంలో భారతరత్నను 2013లో ప్రవేశపెట్టారు. దిగ్గజ క్రికెటర్​ సచిన్​కు​ మొదటగా ఈ అవార్డు ఇచ్చారు. అయితే ఈ పురస్కారానికి అతడి​ కంటే ముందే ధ్యాన్​చంద్ అర్హులని చాలా మంది క్రీడాకారులు భావించారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలని ధ్యాన్​చంద్ తనయుడు అశోక్ ​కుమార్​ సహా భారత దిగ్గజ ఆటగాళ్లు కొంతకాలంగా డిమాండ్​ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

ఇది చూడండి: పాక్ క్రికెటర్​ డేటింగ్ రద్దుకు కారణమైన ధోనీ!

Last Updated : Aug 23, 2020, 4:20 PM IST

ABOUT THE AUTHOR

...view details