ఏడాది విరామం తర్వాత భారత హాకీ జట్టు తొలి అగ్రశ్రేణి అంతర్జాతీయ టోర్నీ బరిలో దిగబోతోంది. ఎఫ్‌ఐహెచ్ ప్రో హాకీ లీగ్‌లో భాగంగా ఒలింపిక్ ఛాంపియన్ అర్జెంటీనాతో మన్‌ప్రీత్‌సింగ్ సారథ్యంలోని భారత్ రెండు మ్యాచ్‌లు ఆడనుంది.
ఏడాది తర్వాత బరిలోకి భారత్ హాకీ జట్టు - ఎఫ్‌ఐహెచ్ ప్రో లీగ్ భారత్ అర్జెంటీనా
ఎఫ్‌ఐహెచ్ ప్రో హాకీ లీగ్‌లో భాగంగా ఒలింపిక్ ఛాంపియన్ అర్జెంటీనాతో మన్‌ప్రీత్‌సింగ్ సారథ్యంలోని భారత్ రెండు మ్యాచ్‌లు ఆడనుంది. తొలి మ్యాచ్ నేడు జరగనుంది.
![ఏడాది తర్వాత బరిలోకి భారత్ హాకీ జట్టు Hockey](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11348512-225-11348512-1618017876578.jpg)
భారత్ హాకీ జట్టు
నేడు (శనివారం) తొలి మ్యాచ్ జరగనుంది. హాకీ ప్రొ లీగ్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడి రెండు విజయాలు, రెండు ఓటములు, రెండు డ్రాలతో మొత్తం 10 పాయింట్లతో మన బృందం అయిదో స్థానంలో ఉంది. బెల్జియం (13 మ్యాచ్‌ల్లో 32 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతోంది.