ఎఫ్‌ఐహెచ్ ప్రో లీగ్ సీజన్-2లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు షాకిచ్చింది భారత జట్టు. భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో కంగారూ జట్టుతో నువ్వా నేనా అన్నట్లు తలపడి గెలిచింది 'మెన్ ఇన్ బ్లూ'.
ఆస్ట్రేలియాపై భారత్ 'షూటౌట్' విజయం - india win over australia in hockey
'ప్రొ హాకీ లీగ్' రెండో సీజన్లో భాగంగా శనివారం భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. చివరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో.. 18 ఏళ్లలో తొలిసారి ఆసీస్ జట్టుపై షూటౌట్ ద్వారా విజయం సాధించింది 'మెన్ ఇన్ బ్లూ'.
18 ఏళ్లలో తొలిసారి...
శనివారం జరిగిన ఈ పోరులో.. నిర్ణీత 60 నిమిషాల ఆటలో 2-2 గోల్స్‌తో ఇరుజట్లు సమంగా నిలిచాయి. భారత్ తరఫున రూపిందర్ పాల్ సింగ్ (25వ నిమిషంలో), హర్మన్‌ప్రీత్ సింగ్ (27వ నిమిషంలో) చెరో గోల్ చేశారు. ఆసీస్ ఆటగాళ్లలో ట్రెంట్ మిట్టన్ (23వ నిమిషంలో), అరాన్ జలేవ్ స్కీ (46వ నిమిషంలో) గోల్ సాధించారు. ఫలితంగా మ్యాచ్ షూటౌట్‌కు దారి తీసింది. షూటౌట్లో అద్భుతమైన గోల్స్‌తో 3-1 తేడాతో నెగ్గింది భారత్. దాదాపు 18 ఏళ్లలో తొలిసారి ఈ తరహాలో విజయం సాధించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో 4-3 తేడాతో ఓడిపోయింది టీమిండియా. ఆ ఓటమికి తాజా విజయంతో ప్రతీకారం తీర్చుకుంది.