బరిలోకి దిగాక నిర్భయంగా, స్వేచ్ఛగా ఆడితే మంచి ఫలితం దక్కుతుందని అంటున్నాడు భారత మహిళల హాకీ జట్టు కోచ్ స్జోర్డ్ మారిజ్నే. ఇటీవలి కాలంలో సానుకూల ఫలితాలతో రాణిస్తున్న రాణీ రాంపాల్ నాయకత్వంలోని జట్టుపై టోక్యో ఒలింపిక్స్‌లో భారీ అంచనాలే ఉన్నాయంటున్నాడు. మెరుగైన ఫిట్నెస్, మ్యాచ్‌లపై మంచి అవగాహన, పోటీతత్వం, బలమైన జట్లపై ఇటీవలి ప్రదర్శనలు ఈ సారి మన జట్టుకు అదనపు బలాలుకానున్నాయని తెలిపాడు. 1980 ఒలింపిక్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన మహిళల హాకీ జట్టు.. ఈసారి అంచనాలు అందుకుంటుందా? రాణీ రాంపాల్ నాయకత్వంలో టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న సందర్భంగా మారిజ్నే 'ఈటీవీ భారత్'తో ముఖాముఖిలో పాల్గొన్నాడు.
ఫిట్నెస్ విషయంలో భారత జట్టు చాలా మెరుగుపడింది. ఇతర బలమైన జట్లతో వారిని ఎలా పోల్చుతారు?
మా ఆటగాళ్ల ఫిట్నెస్ బాగుంది. నాకు వేరే జట్ల గురించి తెలియదు. వారి శిక్షణ ఎలా సాగుతోందో నేనైతే చూడలేదు. అలా పోల్చి చూడాల్సిన అవసరం లేదు. టోక్యోలో ఫిట్నెస్ అనేది కీలక పాత్ర పోషించనుంది. తొలి మ్యాచ్‌కు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉంటారు. కానీ, దానిని చివరి వరకు కొనసాగించగలగాలి. గతేడాది మొత్తం మా ఆటగాళ్లు మంచి శిక్షణ పొందారు. జట్టులోని ప్రతి ఒక్కరూ పూర్తి ఫిట్నెస్తో ఉన్నారు.
ర్యాంకింగ్స్‌లో భారత్ ప్రస్తుతం పదో స్థానంలో ఉంది. అయినప్పటికీ ఈ మెగా ఈవెంట్లో రాణిస్తుందనే నమ్మకం ఉందా?
ర్యాంకింగ్స్‌లో పదో స్థానంలో ఉన్నప్పటికీ.. భారత జట్టు ఈ విశ్వక్రీడల్లో రాణిస్తుందనే నమ్మకం ఉంది. ర్యాంకింగ్‌లను మేం పట్టించుకోం. బలమైన జట్టుతో ఆడేటప్పుడు అలాంటి విషయాలకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వాల్సిన పని లేదు. మా ఆత్మవిశ్వాసం ముందు ఈ ర్యాంకింగ్‌లు ఏం పనిచేయవు.
ఒలింపిక్స్ వంటి పెద్ద టోర్నీల్లో మానసికంగా దృఢంగా ఉండడం చాలా ముఖ్యం. దీనిపై మీరేమంటారు?
అవును, ఇది నిజమే. టోర్నీ ఆరంభంలోనే అగ్రస్థానంలో ఉన్న జట్టుతో ఆడి అందులో గెలిస్తే సంతోషపడాలి. ఓడిపోతే ప్రశాంతంగా ఉండాలి. భావోద్వేగాలను ఎలా నియంత్రించాలన్నది తెలుసుకోవాలి. ఒక్క మ్యాచ్ ఓడిపోగానే మొత్తం అయిపోయినట్టు కాదు. తర్వాత మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేయాలనేది గుర్తుంచుకోవాలి. లేకపోతే ముందుకు సాగడం చాలా కష్టం.
ఇదీ చదవండి:'షెడ్యూల్ ప్రకారం ఒలింపిక్స్ జరిగితే పతకం ఖాయం!'
అర్జెంటీనా, జర్మనీ పర్యటనల్లో భారత జట్టు మంచి ప్రదర్శన చేసింది. ఈ ఆత్మవిశ్వాసం టోక్యో ఒలింపిక్స్‌కు సరిపోతుందా?