ఇప్పటికే 2018లో హాకీ ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చిన ఒడిశా.. మరోసారి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంది. 2023లో జరగనున్న హాకీ వరల్డ్‌కప్‌ను ఒడిశా ప్రభుత్వంతో సంయుక్తంగా భారత సర్కార్ నిర్వహించనుంది. భువనేశ్వర్, రూర్కేలా ఈ ప్రపంచకప్‌కు వేదికలు కానున్నాయి. 2023 జనవరి 13 నుంచి 29 వరకు ఈ మెగాటోర్నీ జరగనుంది.
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బుధవారం ఈ విషయాన్ని ప్రకటించారు. భవనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో నిర్వహించిన వేడుకలో తెలియజేశారు.
"మేము 2018 హాకీ ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చాం. 2023లో ఈ మెగాటోర్నీ నిర్వహించే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉంది. భువనేశ్వర్, రూర్కేలా ఈ ప్రపంచకప్ వేదికలు కానున్నాయి." - నవీన్ పట్నాయక్, ఒడిశా ముఖ్యమంత్రి.