హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ పుట్టిన రోజైన ఆగస్టు 29ని జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రతీ ఏడాది జరుపుకుంటున్నారు. ఆయన జన్మించి నేటికి 115 వసంతాలు పూర్తయింది. ఈ సందర్భంగా ధ్యాన్‌చంద్‌ను భారతరత్న పురస్కారంతో సత్కరించాలని కోరారు ఆయన కుమారుడు అశోక్ ధ్యాన్‌చంద్.
"హాకీలో ధ్యాన్‌చంద్ ప్రతిభను ప్రపంచమంతా గుర్తించింది. హాకీ ఇష్టపడే ప్రతి ఒక్కరూ ఆయనకు భారతరత్న ఇవ్వాలని కోరారు. భారత్‌లో ఈ క్రీడ రూపాన్నే మార్చేసిన ధ్యాన్‌చంద్‌కు.. 1956లోనే భారత మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ వచ్చింది. అప్పటికి ఈ అవార్డు అందుకున్న మెదటి వ్యక్తి ఆయనే. ఆటే ప్రపంచంగా భావించి జీవితంలో ఎంతో సాధించారు. హాకీలో భారత్‌ను ప్రపంచం నెం.1గా నిలబెట్టారు. అయినా ఇప్పటివరకు ధ్యాన్‌చంద్‌కు భారత రత్న ఎందుకు ఇవ్వలేదో నాకు అర్థం కాలేదు." -అశోక్, ధ్యాన్‌చంద్ కుమారుడు