హాకీ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు మేజర్ ధ్యాన్‌చంద్. భారత్‌కు వరుసగా 1928, 1932,1936 ఒలింపిక్స్‌లో స్వర్ణం తెచ్చిన దిగ్గజం ఆయన. 'హాకీ విజర్డ్'గా బిరుదు పొందిన ధ్యాన్‌చంద్ 41 వర్ధంతి (గురువారం) సందర్భంగా.. మాజీ హాకీ ఆటగాడు అబ్దుల్ అజిజ్తో ఈటీవీ భారత్ ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం..
గురువారం ధ్యాన్‌చంద్ 41వ వర్ధంతి. ఆయనను మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు?
ధ్యాన్‌చంద్ హాకీ దిగ్గజం. ఆయన భారత్ కోసం వరుసగా మూడు ఒలింపిక్ స్వర్ణాలు గెలిచారు. ప్రతి ఒక్కరికీ ఆయన గుర్తుండిపోతారు. దేశం గర్వపడేలా చేసిన వ్యక్తి ఆయన.
ఆయనతో మీకున్న అనుభవాలేంటి?
1975లో ధ్యాన్‌చంద్ తనయుడు అశోక్ ధ్యాన్‌చంద్ సారథ్యంలో భారత్ హాకీ ప్రపంచకప్ గెలిచింది. అప్పుడు ఝూన్సీలో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. మానాన్న హాకీ ఆటగాడు కనుక అశోక్ గారిని కలిసే అవకాశం నాకు లభించింది. అప్పడే నేను 'హాకీ దిగ్గజాన్ని' చూశా. నువ్వేం అవుతావ్ అని ధ్యాన్ చంద్ నన్ను అడిగారు. అప్పుడు నేను హాకీ ఆడతా అని చెప్పా. ఝూన్సీ పేరు నిలబెట్టాలని చిరునవ్వుతో ఆయన సమాధానం చెప్పారు.