Asian Champions Trophy Hockey 2021: మహిళల ఆసియా హాకీ ఛాంపియన్‌షిప్‌లో బుధవారం భారత్-దక్షిణా కొరియా మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. భారత మహిళల జట్టులో ఒకరికి కరోనా పాజిటివ్‌గా తేలడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు.
మహిళా హాకీ క్రీడాకారిణికి కరోనా.. కొరియాతో మ్యాచ్ రద్దు - భారత మహిళా హాకీ క్రీడాకారిణికి కరోనా
Asian Champions Trophy Hockey 2021: మహిళల ఆసియా హాకీ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా బుధవారం భారత్-దక్షిణా కొరియా మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. భారత జట్టులో ఒకరికి కరోనా సోకడం వల్ల ఈ మ్యాచ్‌ను అధికారులు రద్దు చేశారు.
Hockey
"రోజువారీ పరీక్షల్లో భాగంగా చేసిన టెస్టుల్లో ఒకరికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఈరోజు దక్షిణ కొరియాతో జరగాల్సిన మ్యాచ్ రద్దయిందని తెలపడానికి విచారిస్తున్నాం" అని హాకీ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌ను 13-0 తేడాతో చిత్తు చేసింది భారత జట్టు. మంగళవారం మలేషియాతో జరగాల్సిన మ్యాచ్ కరోనాతోనే రద్దయింది. మలేషియా జట్టు ఆటగాళ్లకు కరోనా సోకడం వల్ల ఈ మ్యాచ్ జరగలేదు.