ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ నాకౌట్ సమరానికి సిద్ధమైంది. లీగ్ దశలో ఓటమి లేకుండా ముందంజ వేసిన భారత్.. మంగళవారం జరిగే సెమీఫైనల్లో జపాన్‌తో తలపడనుంది. చివరి లీగ్ మ్యాచ్‌లో తమపై 6-0తో గెలిచిన భారత్‌ను సెమీస్‌లో నిలువరించడం జపాన్‌కు కత్తి మీద సామే.
వైస్ కెప్టెన్, డ్రాగ్‌ఫ్లికర్ హర్మన్‌ప్రీత్ సింగ్ భారత్‌ను ముందుండి నడిపిస్తుండగా.. దిల్‌ప్రీత్‌సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్, షంషేర్ సింగ్ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. యువ గోల్‌కీపర్ సూరజ్ కూడా సత్తా చాటుతున్నాడు. సెమీస్‌లోనూ వీళ్లు రాణిస్తే మన జట్టుకు తిరుగుండదు. అటు డిఫెన్స్‌లో, ఇటు అటాకింగ్‌లో దుర్భేద్యంగా ఉన్న మన్‌ప్రీత్ బృందంపై గెలవాలంటే జపాన్ అద్భుతం చేయాల్సిందే.