ASIAN CHAMPIONS HOCKEY TROPHY: ఆసియా ఛాంపియన్స్ హాకీ టోర్నమెంట్లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన డిఫెండింగ్ ఛాంపియన్ భారత్.. అంచనాలను నిలబెట్టుకోలేకపోయింది. లీగ్ దశ మ్యాచ్‌ల్లో ఓటమన్నదే ఎరుగని భారత జట్టు కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్‌లో తడబడింది. జపాన్ చేతిలో 5-3 తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఫైనల్ చేరకుండానే భారత్ పోరు ముగిసింది. ఇక మూడో స్థానం కోసం పాకిస్థాన్‌తో టీమ్‌ఇండియా తలపడనుంది. రౌండ్ రాబిన్ పద్ధతిలో ఆదివారం జపాన్‌తో జరిగిన లీగ్ దశ చివరి మ్యాచులో భారత్ 6-0 తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండు రోజుల వ్యవధిలోనే పరిస్థితులు తారుమారయ్యాయి.
ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఓటమి - ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ వార్తలు
ASIAN CHAMPIONS HOCKEY TROPHY: ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌కు పరాజయం ఎదురైంది. సెమీఫైనల్‌లో జపాన్ చేతిలో 3-5 తేడాతో ఓడిపోయింది.

లీగ్ దశలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటుందా..? అన్నట్లుగా జపాన్ ఆటగాళ్లు చెలరేగిపోయారు. సెమీస్‌లో పూర్తి ఆధిపత్యం కొనసాగించారు. తొలి క్వార్టర్‌లోనే జపాన్ రెండు గోల్స్ సాధించింది. ఆ తర్వాత భారత్ నుంచి దిల్‌ప్రీత్ ఒక గోల్ కొట్టాడు. కొద్దిసేపటికే జపాన్ మరో గోల్ సాధించింది. దీంతో తొలి అర్ధ భాగం ఆట పూర్తయ్యేసరికి భారత్ 1-3 గోల్స్ తేడాతో వెనుకబడింది. అనంతరం జపాన్ మరో రెండు గోల్స్ సాధించి భారత్‌పై పూర్తి ఆధిపత్యం సాధించింది. కాస్త పుంజుకున్న భారత్ స్వల్ప వ్యవధిలోనే రెండు గోల్స్ సాధించింది. హర్మన్ ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్ చెరో గోల్ కొట్టారు. అయితే జపాన్ ఆధిక్యాన్ని 3-5కి తగ్గించగలిగినా.. విజయం మాత్రం దక్కలేదు.
ఇదీ చదవండి:జపాన్‌తో నాకౌట్ సమరం.. భారత్‌కు ఎదురుందా?