భారత్.. మరోసారి ప్రతిష్టాత్మక ప్రపంచకప్ నిర్వహణ బాధ్యతలు దక్కించుకుంది. 2023 పురుషుల హాకీ ప్రపంచకప్‌నకు అతిథ్యమివ్వనుంది. ఈ హక్కుల కోసం మరో రెండు దేశాలు పోటీపడినా... చివరికి ఆ అదృష్టం భారత్‌నే వరించింది.
2022లో జరిగే మహిళల ప్రపంచకప్‌ను స్పెయిన్, నెదర్లాండ్స్ నిర్వహించనున్నాయి. అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్(ఐహెచ్ఎఫ్)..శుక్రవారం వీటికి సంబంధించిన ప్రకటన ఇచ్చింది.
2022 జులై 1-17 తేదీల్లో మహిళల టోర్నీ, 2023 జనవరి 13-29 మధ్యలో పురుషుల మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆతిథ్య దేశాలు.. త్వరలో వేదికలను ప్రకటించనున్నాయి.
ఆతిథ్యదేశాలు... నేరుగా టాప్-5లో చోటు సొంతం చేసుకుంటాయి. అంతేకాకుండా కాంటినెంటల్ ఛాంపియన్షిప్ గెలిచిన జట్టు ఈ జాబితాలో చేరుతుంది. మిగతా జట్లు.. స్వదేశం, విదేశాల్లో 'ప్లే ఆఫ్ మ్యాచ్'లు ఆడాల్సి ఉంటుంది.