భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ ఐ.ఎం.విజయన్ పేరును అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య పద్మశ్రీ పురస్కారానికి సిఫార్సు చేసింది. కేంద్ర హోం శాఖకు అతడి పేరును పంపించినట్లు ఏఐఎఫ్‌ఎఫ్ కార్యదర్శి కుశాల్ దాస్ వెల్లడించారు.
పద్మశ్రీకి విజయన్ పేరు సిఫార్సు - padma shri latest news
భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ ఐ.ఎం. విజయన్ పేరును పద్మశ్రీకి సిఫార్సు చేసింది అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య. ఈ మేరకు అతడి పేరును కేంద్ర హోంశాఖకు పంపినట్లు అధికారులు తెలిపారు.
![పద్మశ్రీకి విజయన్ పేరు సిఫార్సు Vijayan's name recommended for Padma Shri](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7662616-843-7662616-1592446468403.jpg)
పద్మశ్రీకి విజయన్ పేరు సిఫార్సు
51 ఏళ్ల విజయన్ భారత్ తరఫున 79 మ్యాచ్‌ల్లో 40 గోల్స్ సాధించాడు. 2003లో అర్జున అవార్డు అందుకున్న విజయన్.. 1993, 1997, 1999లలో 'ఇండియన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్' పురస్కారాలు గెలుచుకున్నాడు. 2000 నుంచి 2003 వరకు భారత జట్టుకు సారథ్యం వహించాడు.