ఫుట్‌బాల్ అభిమానులకు యూరోపియన్ పాలక మండలి షాకిచ్చే వార్త చెప్పింది. కరోనా నేపథ్యంలో యూరో 2020 టోర్నీని ఏకంగా ఏడాది వాయిదా వేస్తున్నట్లు మంగళవారం తెలిపింది. ఈ మెగాలీగ్ను 2021 జూన్ 11 నుంచి జులై 11 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ టోర్నీ చరిత్రలో తొలిసారి ఫైనల్ స్టేజీ పోటీలు వాయిదా పడ్డాయి. వీటితో పాటు ఐరోపాలోని ఇంగ్లాండ్, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ ఫుట్‌బాల్ లీగ్‌లు కూడా రద్దయ్యాయి. ఫిఫా వరల్డ్‌కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లూ రద్దు చేశారు.
కరోనా కిక్ ఇస్తే 2021లో పడిన యూరో ఛాంపియన్షిప్ - football European Championship 2020
ప్రతిష్టాత్మక ఫుట్‌బాల్ టోర్నీ యూరోపియన్ ఛాంపియన్షిప్ ఏడాది వాయిదా పడింది. కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది యూఈఎఫ్ఏ. తాజాగా ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించింది.
కరోనా తన్నితే 2021లో పడిన యూరో ఛాంపియన్షిప్!
యూరో 2020 టోర్నీ రద్దుకు యూఈఎఫ్ఏతో దాదాపు 55 సభ్య సంఘాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించుకుని ఓ నిర్ణయానికి వచ్చాయి. ఈ ఏడాది జూన్ 12 నుంచి జులై 12 వరకు జరగాల్సిన టోర్నీని వాయిదా వేస్తున్నట్లు తెలిపాయి.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే లక్షా 80వేల మంది కరోనా వైరస్ బారిన పడగా.. దాదాపు 7వేల మంది మరణించారు.