మరో ఫుట్‌బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo) దారిలో నడిచాడు. ప్రెస్‌మీట్ సందర్భంగా ఫ్రాన్స్ ఫుట్‌బాల్ స్టార్ పాల్ పోగ్బా(Paul Pogba) తన ముందున్న ఓ బీర్ బాటిల్‌ను ఏకంగా కింద పెట్టేశాడు. యూఈఎఫ్‌ఏ యూరో 2020(UEFA 2020) టోర్నమెంట్‌లో భాగంగా జర్మనీపై గెలుపొందిన అనంతరం జరిగిన ప్రెస్‌మీట్‌లో ఈ ఘటన జరిగింది. ఈ టోర్నమెంట్‌లో భాగంగా.. బుధవారం ఫ్రాన్స్, జర్మనీ మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ సాగింది. ఈ ఉత్కంఠ పోరులో జర్మనీపై ఫ్రాన్స్ 1-0 తేడాతో విజయం సాధించింది.
UEFA 2020: రొనాల్డో కోకాకోలా.. పోగ్బా బీర్ బాటిల్ - బీర్ బాటిల్ కింద పెట్టిన పాల్ పోగ్బా
మరో ఫుట్‌బాల్ ఆటగాడు పాల్ పోగ్బా(Paul Pogba).. రొనాల్డో దారిలోనే నడిచాడు. యూరో కప్ ప్రెస్‌మీట్ సందర్భంగా టేబుల్‌పై ఉన్న బీర్ బాటిల్‌ను తీసి కింద పెట్టేశాడు.
పోగ్బా
మ్యాచ్ అనంతరం ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ పాల్ పోగ్బా ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నాడు. అక్కడ టేబుల్‌పై కనిపించిన బీర్ బాటిల్‌ను తీసి కిందపెట్టేశాడు. టోర్నీ స్పాన్సర్లలో ఆ కంపెనీ కూడా ఒకటి. మద్యపానానికి దూరంగా ఉండే పోగ్బా ఈ విధంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఈ టోర్నీలో ఇలా వ్యవహరించిన రెండో క్రీడాకారుడు పోగ్బా. ఇంతకుముందు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానుల్ని సంపాదించుకున్న ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో తన ముందున్న రెండు కోకాకోలా బాటిళ్లను తీసి దూరంగా పెట్టాడు.