తన అందాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టే సన్నీ లియోనీ.. క్రీడా నైపుణ్యంతోనూ కట్టిపడేస్తోంది. ఫుట్బాల్ ఆడుతూ ఆకట్టుకుంది. అబుదాబీలో జరుగుతోన్న టీ10 లీగ్లో దిల్లీ బుల్స్ తరఫున ప్రచారం చేస్తున్న ఈ భామ.. సరదాగా సాకర్ ఆడి అలరించింది. ఈ వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేసింది.
"వాట్స్ మై నేమ్..వాట్స్ మై నేమ్?" అనే క్యాప్షన్ జోడించి ఈ వీడియోను షేర్ చేసింది సన్నీ. ఇందులో వరుసగా గోల్స్ కొడుతూ నెటిజన్లను కట్టిపడేసింది. ఈ సమయంలో ఆమె భర్త డేనియల్ వెబర్ వెంటే ఉన్నాడు.