మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న భారత యువ ఫుట్‌బాల్ ప్లేయర్ రామానంద నింగ్‌కు.. క్రీడా మంత్రిత్వ శాఖ రూ.5లక్షలు ఆర్థిక సాయం చేసింది. పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ జాతీయ సంక్షేమ నిధి కింద వాటిని అందజేసింది. ఈ విషయాన్ని కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు.
ఫుట్‌బాల్ ప్లేయర్‌కు అనారోగ్యం.. అండగా క్రీడాశాఖ - latest ramananda
కొద్దికాలంగా మూత్ర పిండాల సమస్యతో బాధపడుతున్న భారత యువ ఫుట్‌బాలర్ రామానందకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది క్రీడా మంత్రిత్వ శాఖ.
Sports Ministry sanctions Rs 5 lakh for ailing junior footballer Ramananda
రిక్షావాలా కుమారుడైన రామానంద.. ప్రస్తుతం మణిపుర్‌లోని షీజా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని చూపు కూడా మసకబారుతున్నట్లు వైద్యులు తెలిపారు. 2017లో గౌహతిలో జరిగిన అండర్-17 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో.. రామానంద భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
Last Updated : Sep 10, 2020, 11:42 AM IST