తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐదోసారి మహిళా ఫుట్​బాల్ టైటిల్ భారత్​​ కైవసం - గ్రేస్​ డెగ్మయి

భారత మహిళల ఫుట్​బాల్​ జట్టు మరోసారి తన సత్తా చాటింది. శాఫ్​ మహిళల ఛాంపియన్​షిప్​ను వరుసగా ఐదోసారి గెలుచుకుంది. శుక్రవారం నేపాల్​లోని విరాట్​​​నగర్​లో జరిగిన ​ఫైనల్లో నేపాల్​ను 3-1తో ఓడించింది భారత జట్టు.

ఐదోసారి మహిళా ఫుట్​బాల్ టైటిల్ భారత్​​ కైవసం

By

Published : Mar 23, 2019, 1:20 PM IST

2010లో ప్రారంభమైన శాఫ్ టోర్నీలో భారత్​ ఒక్కసారీ ఓడిపోలేదు. ఈ ఫైనల్​తో వరుసగా 23 మ్యాచ్​లు గెలిచి తన విజయ ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది.

  • శాఫ్​ మహిళల ఛాంపియన్ షిప్​లో భారత్​ 5వ సారి జయకేతనం ఎగురవేసింది. శుక్రవారం సాయంత్రం నేపాల్​ వేదికగా సహీద్​ రంగశాల స్టేడియంలో భారత్​- నేపాల్​ మధ్య ఫైనల్​ జరిగింది. ఇందులో భారత మహిళా పుట్​బాల్​ జట్టు 3-1తో విజయం సాధించింది.
    టాప్​ స్కోరర్​ టైటిళ్లతో భారత క్రీడాకారిణులు ఇందుమతి, దాల్మియా

తొలి గోల్​ వాళ్లది.. విజయం మనది:

  1. తొలి అర్ధ భాగంలో భారత క్రీడాకారిణి దాల్మియా చిబ్బర్​ మొదటి గోల్​ చేసింది. దీంతో అప్పటివరకు ఒక పాయింట్​తో ఆధిక్యంలో ఉన్న నేపాల్​ స్కోరును సమం చేసింది.
  2. ద్వితీయ భాగంలో 63వ నిమిషంలో గ్రేస్​ డెగ్మయి ఇండియాకు రెండో గోల్​ అందించింది. అనంతరం 76వ నిమిషంలో అంజు తమంగ్​ మూడో గోల్​ కొట్టింది.
  3. ఈ మ్యాచ్​ విజయంతో 5 సార్లు భారత్​ శాఫ్ టైటిల్​ గెలిచి రికార్డు సృష్టించింది.

.

ABOUT THE AUTHOR

...view details