డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ సౌత్ ఆసియన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్(శాఫ్) మహిళల ఛాంపియన్‌షిప్‌లో ఐదవసారి ఫైనల్లో అడుగుపెట్టింది. బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్లో 4-0తో విజయం సాధించింది.
విజయానందంలో భారత ఫుట్‌బాల్ క్రీడాకారిణులు - భారత క్రీడాకారిణి దల్మీర్ చిబ్బర్ 18వ నిముషంలోనే తొలిగోల్ కొట్టింది. మరో నాలుగు నిముషాల్లోనే ఇందుమతి రెండో గోల్‌తో అదరగొట్టింది. 37వ నిముషంలో ఇందుమతి మరో గోల్ చేసింది. ఆఖరి క్షణంలో నాలుగో గోల్ వేసింది మనీషా.
ఎక్కడా బంగ్లాకు అవకాశం ఇవ్వకుండా భారత క్రీడాకారిణులు ఆకట్టుకున్నారు. ఇప్పటివరకు భారత్ వరుసగా 22 పుట్‌బాల్ మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 2010లో టోర్నీ ప్రారంభం కాగా...భారత్ ఒక్కసారి కూడా పరాజయం చెందలేదు.
నాలుగు సార్లు విజేతగా నిలిచిన భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు... ఐదోసారి గెలిచి జైత్రయాత్ర కొనసాగించాలనుకుంటోంది. భారత్-నేపాల్ మధ్య ఫైనల్ మ్యాచ్ శుక్రవారం నేపాల్‌లోని బిరత్నగర్లో జరగనుంది.