పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo) అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్ చరిత్రలోనే వ్యక్తిగతంగా అత్యధిక గోల్స్ (Ronaldo Goals)చేసిన ఆటగాడిగా నిలిచాడు. బుధవారం.. ఐర్లాండ్‌తో జరిగిన ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ (World Cup qualifying) మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు.
ఈ మ్యాచ్‌లో 89 నిమిషంలో తన 110వ గోల్ చేసిన రొనాల్డో.. ఇరాన్ మాజీ ఆటగాడు అలీ డేయి రికార్డును తిరగరాశాడు (1993 నుంచి 2006 వరకు అలీ డేయి (Ali Daie).. ఇరాన్ తరపున ప్రాతినిధ్యం వహించాడు). ఆట ముగియడానికి మరో ఆరు నిమిషాలు ఉందనగా తన 111వ గోల్‌తో చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డు కోసం 180 మ్యాచ్‌లు తీసుకున్నాడు రొనాల్డో.
"ఆట ముగిసే సమయంలో రెండు గోల్స్ చేయడం చాలా కష్టం. కానీ జట్టు సమష్టి కృషితో ఇది సాధ్యమైంది. మేము గెలుస్తామని చివరి వరకు నమ్మకం ఉంది."