రియల్ మాడ్రిడ్.. లా లిగా టైటిల్ విజేతగా నిలవడంపై సంతోషం వ్యక్తం చేశాడు టీమ్ఇండియా క్రికెటర్ రోహిత్ శర్మ. జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతూ సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్ట్ పెట్టాడు.
"రియల్ మాడ్రిడ్ ఖాతాలో మరో టైటిల్. కష్ట సమయంలో జట్టుగా ఆడారు. శుభాకాంక్షలు." అంటూ సందేశం పోస్ట్ చేశాడు హిట్మ్యాన్.
ప్రస్తుతం భారత్లో లా లిగా టోర్నీకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు రోహిత్ శర్మ. అలాగే తాను రియల్ మాడ్రిక్ అభిమానినని ఆ సందర్భంలో వెల్లడించాడు.
ఇంతకుముందు స్పెయిన్లో జరిగిన బార్సిలోనా-రియల్ మాడ్రిడ్ మ్యాచ్కు తన సతీమణి రితికాతో కలిసి హాజరయ్యాడు రోహిత్. లా లిగా ఆతిథ్యం బాగుందని ఆ మ్యాచ్ చూసేందుకు వీలు కల్పించినందుకు ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చాడు.