సినీ నటుడు దగ్గుపాటి రానా సరికొత్త పాత్రలో మెరవనున్నాడు. అయితే సినిమాల్లో కాదు.. ఆటల్లో. అవును.. ఇండియన్ సూపర్ లీగ్‌లో హైదరాబాద్ జట్టుకు కో ఓనర్‌గా ఉండబోతున్నాడు.
సూపర్ లీగ్‌లో హైదరాబాద్ ఎఫ్‌సీ ఈ సీజన్లోనే అరంగేట్రం చేసింది. త్రిపురనేని వరుణ్, మద్దూరి విజయ్ ఓనర్లుగా ఉన్నారు. వీరిద్దరూ టీమ్ మేనేజ్‌మెంట్‌లోకి రానాను ఆహ్వానించారు.