2022లో జరిగే ఫిఫా ప్రపంచకప్ చూడాలనే అభిమానులకు.. కొత్త నిబంధన పెట్టింది ఖతార్. పూర్తిగా వ్యాక్సిన్ తీసుకున్న వారినే ఈ టోర్నీకి అనుమతించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాని అబ్దులాజీజ్ అల్ థానీ ధ్రువీకరించారు. అయితే ఈ టోర్నీని ప్రేక్షకుల సమక్షంలో నిర్వహించనున్నట్లు ఫిఫా అధ్యక్షుడు వెల్లడించారు.
వ్యాక్సిన్ తీసుకుంటేనే ప్రపంచకప్‌కు అనుమతి - వ్యాక్సిన్ తీసుకున్న వారికే ఫిఫాకి అనుమతి
2022లో జరిగే ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు పూర్తి వ్యాక్సినేషన్ తీసుకున్న వారినే అనుమతించనుంది ఖతార్. ఈ విషయాన్ని ఖతార్ ప్రధాని అబ్దులాజీజ్ అల్ థానీ ధ్రువీకరించారు.
![వ్యాక్సిన్ తీసుకుంటేనే ప్రపంచకప్‌కు అనుమతి fifa wc, qatar 2022](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12214271-18-12214271-1624283198128.jpg)
ఫిఫా వరల్డ్‌కప్, ఖతార్ 2022
2022 నవంబర్‌లో నాలుగు వారాల పాటు సాకర్ ప్రపంచకప్ నిర్వహించనుంది ఈ గల్ఫ్ దేశం. అందుకోసం ముందు జాగ్రత్తగా పది లక్షల కొవిడ్ డోసులను సిద్ధంగా పెట్టుకున్నట్లు తెలిపింది. ఆ సమయానికి చాలా దేశాలు తమ పౌరులకు టీకా పంపిణీ చేసే అవకాశం ఉంది. అయినా ఈ మెగా ఈవెంట్ కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది.
ఇదీ చదవండి:మైదానంలోనే కుప్పకూలిన ఫుట్‌బాల్ ఆటగాడు