ఫుట్‌బాల్ అనగానే వెంటనే గుర్తొచ్చే ఆటగాళ్లు క్రిస్టియానో రొనాల్డో(Ronaldo Income), మెస్సి(Messi News). ఈ ఆటగాళ్లకున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. మైదానంలో తమ ఆటతీరుతో కోట్లు సంపాదిస్తుంటారు. అయితే.. ప్రపంచంలో అత్యంత ధనిక ఫుటబాలర్(Richest Footballer in the world) మాత్రం వీరిద్దరూ కాదంటే నమ్మశక్యంగా అనిపించదు. మరి వీరిని మించిన ధనిక ఆటగాడు ఎవరో తెలుసుకుందాం..
బ్రూనై జట్టు ఆటగాడే..
ఛెల్సియా లైసెస్టర్ సిటీ అకాడమీ మాజీ ఆటగాడు ఫైక్ బుకయ్య(23) ప్రపంచ ఫుట్‌బాల్ ఆటగాళ్లందరిలోనూ ధనవంతుడు. బ్రూనై అంతర్జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇతడు స్వయానా బ్రూనై సుల్తాన్ హస్సానల్ బుకయ్య మేనల్లుడు.
ఫైక్ ఆదాయం దాదాపు 17.5 బిలియన్ డాలర్లు. అయినప్పటికీ ఫుట్‌బాల్ ఆటగాడిగా పేరు తెచ్చుకునేందుకే ఇష్టపడ్డాడు. అమెరికా లాస్ ఏంజెల్స్‌లో జన్మించిన ఫైక్.. ఇంగ్లాండ్ బెర్క్‌షైర్‌లో విద్యను పూర్తిచేసుకున్నాడు. 2009లో ఫుట్‌బాల్ అడేందుకు సౌతాంప్టన్ యూత్ అకాడమీలో చేరాడు. అనంతరం తన ఫుట్‌బాల్ ప్రస్థానాన్ని కొనసాగించాడు. అయితే.. ఫైక్ తన ధనబలాన్ని ఎక్కడ ఉపయోగించేవాడుకాదని, ధనికుడన్న విషయం తెలియనీయకుండా.. ఇతర ఆటగాళ్లతో సులభంగా కలిసిపోయేవాడని స్టామ్ఫోర్డ్ బ్రిడ్జ్ టీమ్ ఆటగాడు రుబెన్ సమాట్ తెలిపాడు.