స్పానిష్ లీగ్(లాలిగా) భాగంగా బార్సిలోనా జట్టు చివరి మ్యాచ్‌కు స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ దూరం కానున్నాడు. దీంతో కోపా అమెరికా సీజన్‌కు ముందు మెస్సీకి మరికొంత అదనపు విశ్రాంతి లభించనుంది. నామమాత్రమైన చివరి మ్యాచ్‌లో అతడు అందుబాటులో ఉండడని బార్సిలోనా జట్టు ప్రకటించింది.
తాజా సీజన్‌తో బార్సిలోనా జట్టుతో మెస్సీ కాంట్రాక్టు ముగుస్తుంది. తర్వాతి ఏడాది కోసం అతడు అందుబాటులో ఉండేది.. లేనిది స్పష్టం చేయలేదు. కెరీర్ ఆరంభం నుంచి బార్సిలోనాకు ఆడాడు మెస్సీ. బార్సిలోనా విధివిధానాలు నచ్చకపోవడం వల్ల 2019-20 సీజన్లోనే బార్సిలోనా నుంచి వైదొలగాలని మెస్సీ భావించాడు.