స్పానిష్ క్లబ్ బార్సిలోనాతో అర్జెంటినా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ మరో కొత్త కాంట్రాక్ట్ కుదుర్చుకోనున్నట్లు తెలుస్తోంది. కొత్త డీల్‌లో భాగంగా మెస్సీ.. వేతనంలో 50 శాతం కోతకు సిద్ధమయ్యాడని స్థానిక మీడియా ప్రచురించింది. ఈ మేరకు బార్సిలోనా క్లబ్ త్వరలోనే ప్రకటన చేయనుందని సమాచారం.
2004 నుంచి మెస్సీ బార్సిలోనా క్లబ్తోనే ఉన్నాడు. ఈ ఏడాది జూన్‌తో అతడి కాంట్రాక్ట్ గడువు ముగిసింది. దీంతో మరో ఐదేళ్లకు ఒప్పందం కుదుర్చుకోబోతున్నట్లు తెలుస్తోంది.