స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ సారథ్యంలో అర్జెంటీనా జట్టు గత నెల కోపా అమెరికా కప్ గెలుచుకుంది. ఈ మ్యాచ్ అనంతరం విజయానందాన్ని కుటుంబ సభ్యులతో పంచుకున్నాడు మెస్సీ. మెడల్‌ను తన భార్య ఆంటోనెలా రోకుజోకు చూపిస్తూ మురిసిపోయాడు. అయితే పెయిడ్ ప్రమోషన్లో భాగంగానే మెస్సీ ఈ వీడియో కాల్ చేసినట్లు తాజాగా పలు ఇంగ్లీష్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇందుకు గానూ వాట్సాప్ నుంచి భారీగానే నగదు అందినట్లు తెలుస్తోంది. అది ఎంతనేది స్పష్టత లేనప్పటికీ.. ఒక్క ఇన్‌స్టా పోస్టు ద్వారానే దాదాపు రూ.6.5 కోట్లు పొందినట్లు సమాచారం.
ఒక్క వీడియో కాల్ కోసం మెస్సీకి కోట్ల రూపాయలు!
స్టార్ ఫుట్‌బాలర్ మెస్సీ.. ఒక్క వీడియో కాల్ మాట్లాడినందుకు అతడికి భారీగా సమర్పించింది వాట్సాప్ సంస్థ. ఇంతకీ ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగింది?
లియోనల్ మెస్సి, కోపా అమెరికా కప్
ఈ వాట్సాప్ కాల్‌ను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన మెస్సి.. "ఇదొక ప్రత్యేకమైన క్షణం! కోపా అమెరికా కప్‌ను గెలుపొందిన తర్వాత.. నా సంతోషాన్ని నా కుటుంబ సభ్యులతో వాట్సాప్ వీడియో కాల్ ద్వారా పంచుకున్నాను" అని రాసుకొచ్చాడు. అయితే ఈ వీడియోకు 1.78 కోట్ల లైక్‌లు వచ్చాయి.
ఇదీ చదవండి:ఒక్క ఫొటో- 2 కోట్ల లైక్‌లు..