దిగ్గజ ఫుట్‌బాలర్ పీలే రికార్డును సమం చేశాడు బార్సిలోనా స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ. ఒకే క్లబ్ తరపున అత్యధిక గోల్స్(643) చేసిన ఆటగాడిగా పీలే సరసన నిలిచాడు మెస్సీ. సాన్టోస్ క్లబ్ తరపున గతంలో ఆడిన పీలే వాలెన్సియా క్లబ్‌పై ఈ ఘనతను సాధించాడు. ప్రస్తుతం అదే రికార్డును మెస్సీ సమం చేశాడు.
పీలే రికార్డును సమం చేసిన మెస్సీ - మెస్సీ పీలే రికార్డు
బార్సిలోనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ కొత్త రికార్డును చేరుకున్నాడు. అన్ని టోర్నీల్లో ఒకే క్లబ్ తరపున అత్యధిక గోల్స్(643) చేసిన ఆటగాడిగా పీలే రికార్డును సమం చేశాడు.
పీలే రికార్డును సమం చేసిన మెస్సీ
బార్సిలోనా, వాలెన్సియా మధ్య జరిగిన మ్యాచ్ 2-2 పాయింట్లతో డ్రా గా ముగిసింది. దీంతో ఇరు జట్లకు చెరో విన్నింగ్ పాయింట్ లభించింది. బార్సిలోనా తరపున మెస్సీ, రొనాల్డో అరౌజో చెరో గోల్ నమోదు చేయగా.. వాలెన్సియా తరపున మౌక్టర్ డియాకాబీ, మాక్సిమిలియానో గొంజాలెజ్ గోల్స్ చేశారు. లా లిగా పాయింట్ల పట్టికలో 21 పాయింట్లతో బార్సిలోనా ఐదో స్థానంలో నిలిచింది.
ఇదీ చూడండి:ఐసీసీ అసోసియేట్ సభ్య డైరెక్టర్‌గా ఖవాజా